లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి:
పట్టణంలోని గోదావరిరోడ్డు వీకర్ సేక్షన్ కాలనిలో పోలీసుల కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఈసర్చ్ లో సుమారు 30 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకొని విచారణ చెప్పట్టారు. ఈసందర్భంగా సిఐ నరేందర్ సర్ మాట్లాడుతూ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా కార్డాన్ సర్చ్ నిర్వహిచడం జరుగుతుందన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదని, వాటికి బానికై జీవితాన్ని నాశనం చేసుకోకూడదన్నారు, కాలనీలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి వాహన దారుడు వాహనాల పత్రాలను వాహనంతోపాటు ఉంచుకోవాలని, రాష్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు.
గంజాయి, డ్రగ్స్ లాంటివి అమ్మితే చాలా పెద్ద నేరమని వాటి జోలికి పోయి కేసుల్లో ఇరుక్కోకుడదని అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో పట్టణ ఎస్సై సతీష్, ఎస్సై-2 తానాజీ తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.