
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ పై సంతకం చేసిన ఘనత వైయస్ ధీ అని అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వైఎస్సార్ అలాగే పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి కాలేజీ ఫీజులను ఫీజు రియంబర్స్మెంట్ కింద చెల్లించిన ఘనత వైయస్ ది ఆ ని అలాగే రైతులు రుణభారం తీర్చలేని స్థితిలో ఉంటే ఏ కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత వైయస్సార్ ది అని ఎప్పుడు పేద ప్రజల సంక్షేమం మరియు అనేక పథకాలు ప్రవేశపెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన ఏకైక మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని రాష్ట్రంలో అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ గాని 108 గాని 104 గాని పేద ప్రజలకు సంబంధించిన అనేక పథకాలు ప్రవేశపెట్టిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అలాంటి వ్యక్తి రెండు రాష్ట్రాలలో ప్రజల గుండెల్లో. స్థిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన జయంతి వేడుకలను కేక్ కట్ చేసి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో మండల గ్రామాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు