
రామకృష్ణాపూర్ , నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను సోమవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి కార్యదర్శి రఘునాథ్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ… స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మహానీయుడని, మహనీయుని ఎనలేని ప్రజా సేవను గుర్తు చేసుకుంటూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ముందుగా రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఓడ్నాల శ్రీనివాస్, గోపు రాజం,పలిగిరి కనకరాజు, వెంకటేశ్వర్లు, బింగి శివ కిరణ్, ఎర్రబెల్లి రాజేష్ ,రాజయ్య, పల్లె దినేష్ తదితరులు పాల్గొన్నారు.