
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పాముకుంట్ల తిరుపతయ్య ఇటీవల ప్రధానోపాధ్యాయులు గా పదోన్నతి పొందిన సందర్భంగా ఏబీవీపీ ప్రాంత కార్య సమితి సభ్యులు వేల్పుల రాజు కుమార్ మరియు బీజేవైఎం మండల అధ్యక్షులు
మైదామ్ శ్రీకాంత్ నైన్ పాక పాఠశాలలో సోమవారం రోజున ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపాముకుంట్ల తిరుపతయ్య దళిత కాలనీ ల నుండి అంబేడ్కర్ స్ఫూర్తి తో కష్ట పడి ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి సాధించి రాంనగర్ కాలనీ యువకుల కు ఆదర్శంగా నిలుస్తూ ,విద్య ,మరియు క్రీడల్లో యువకుల ను ప్రోత్సహిస్తూ , బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సాధనకు కృషి చేస్తూ 26 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహించి ప్రధానోపాధ్యాయుడు గా పదోన్నతి సాధించడం చాలా సంతోషకరం అని రామ్ నాగర్ కాలనీ వాసులు గా గర్వకారణం అని కొనియాడారు, ఈ కార్యక్రమం లో విద్యార్థులు ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు