
# నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవు.
# ఎస్సై పరమేశ్ ..
నర్సంపేట,నేటిధాత్రి :
దుగ్గొండి మండల కేంద్రంలోని ఆధర్శవాణి హై స్కూల్,రేకంపెల్లిలోని లిటిల్ ఫ్లవర్ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులను దుగ్గొండి ఎస్సై పరమేశ్ శనివారం తనిఖీలు నిర్వహించారు.ఆయా బస్సులకు చెందిన ఆర్సి కార్డులు,ఇన్స్యూరెన్స్,పొల్యూషన్ పత్రాలు,దైవింగ్ లైసెన్సులు పరిశీలన చేసినట్లు ఎస్సై తెలిపారు.అలాగే ఆధర్శవాణి హై స్కూల్ కు చెందిన 6 బస్సులు,లిటిల్ ఫ్లవర్ స్కూల్ కు చెందిన 1 బస్సుల పిట్ నెట్ పరిశీలన చేశామన్నారు.డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టరీత్యా చర్యులు తప్పవని హెచ్చరించారు.పాఠశాలల డ్రైవర్లు విద్యార్థుల భవిష్యత్ పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఎస్సై పరమేశ్ సూచించారు.ఈ తనిఖీల్లో ఆధర్శవాణి హై స్కూల్ చైర్మన్ రవి,లిటిల్ ఫ్లవర్ పాఠశాల చైర్మన్ విజేందర్ ఉన్నారు.