రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
పేద విద్యార్థులను ప్రభుత్వాలు చదువులకు దూరం చేస్తున్నాయని తెలంగాణ బలహీన వర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది మోతె రాజలింగు అన్నారు. శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలో సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… పేద విద్యార్థులను చదువులకు దూరం చేయాలనే ఉద్దేశంతోనే కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ, ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. బలహీనవర్గాల విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించడం లేదని, హాస్టల్లో విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచడం లేదన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి, ప్రభుత్వ యూనివర్సిటీల్లో పేద విద్యార్థులు చదవకుండా దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.