
మంచిర్యాల నేటిదాత్రి
ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ గారి 39వ వర్ధంతి ని పురస్కరించుకొని అంబేద్కర్ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు అదేవిధంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న సమరయోధుడని గొప్ప సంఘసంస్కర్త రాజకీయ వేత్త ఇతను బీహార్ లోని చందన అర్రం అనే గ్రామంలో 1908 ఏప్రిల్ 5వ తేదీన జన్మించి, అంటరాని తనం కుల విదక్ష పై పోరాటం చేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అందించిన భారత రాజ్యాంగంలోని ఫలాలను ఆర్థిక సామాజికంగా దళితులకు అందే విధంగా కృషి చేశాడని తెలిపారు. గత నాలుగు దశాబ్దాలుగా మంత్రి పెదవులను చేపట్టి అదేవిధంగా దళిత వర్గానికి చెందిన బాబు జగ్జీవన్ రామ్ గారు భారత దేశ తొలి ఉప ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారని కొనియాడారు, ఈ కార్యక్రమంలో జి వెంకటేష్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్, డాక్టర్ శరత్ బాబు, దుర్గ స్వామి, పాల్తెపు శంకర్, గొడిసెల దశరథం, చుంచు శంకర్ వర్మ, గొడిసెల రాజారాం, కుంటాల శంకర్, మోతే పోచం, సిరికొండ బోస్, గడ్డం సత్యం,లు పాల్గొన్నారు