
వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో వర్ధంతి వేడుకలు
వేములవాడ రురల్ నేటి ధాత్రి
దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం అని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.శనివారం వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బాబూ జగ్జీవన్ రాం వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..
వారు మాట్లాడుతూ వారు చేసిన సేవలు ఈ తరానికి ఒక స్ఫూర్తిగా నిలిచేల కృషి చేయాలన్నారు.నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలన్నారు..
జగ్జీవన్ రామ్ ఒక గొప్ప సంఘసంస్కర్త రాజకీయవేత్త సమాజంలో అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం కులరహిత సమాజం కోసం పోరాడిన ఒక గొప్ప పోరాట యోధుడు అని అన్నారు.. వారు ఎంపీగా కేంద్ర మంత్రిగా దేశ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు..
జగ్జీవన్ రామ్ కూతురు మీరా కుమారి కూడా వారి అడుగు జాడల్లో నడుస్తూ దేశానికి సేవలు అందించారని,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో వారు స్పీకర్ గా ఉండి తెలంగాణ బిల్లు పాసయ్య సమయంలో వారు ఉన్నారని గుర్తు చేశారు..
ప్రజలను చైతన్యవంతం చేయడంలో వారు ఎప్పుడు ముందు ఉండేవారన్నారు..రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయకులకు సహాయం చేయడానికి అరుగ్యారెంటీలని అమలు చేస్తోదన్నారు…
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రైతు రుణమాఫీ చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని. అది కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు..
2008 లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నపుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏకకాలంలో రైతులకు 68 వేల కోట్లు రుణమాఫీ చేశామని మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీతో రాష్ట్రంలో 31 వేల కోట్లు చేయడం జరుగుతుందని అన్నారు..
రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చామని గతంలో గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు ఇచ్చారని కానీ ఇప్పుడు నిజమైన రైతులకు ఇస్తామని, దానికోసం రాష్ట్రప్రభుత్వం కమిటీ వేసిందన్నారు…
రానున్న రోజుల్లో వారి ఆలోచన పూర్తిగా తీసుకొని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడుతానని అన్నారు..