
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శిస్తున్న విషయం తెలుసుకుని కలెక్టర్ ని కలిసి గుండాల మండల కేంద్రంలో బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గ్రామీణ ప్రాంతాల నుండి మండల కేంద్రంలో వివిధ పనుల గురుంచి వచ్చే ప్రజలకు మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇబంధులు పడుతున్న విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే మండల కేంద్రంలో ఉన్న రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తం గా ఉందని దాని వల్ల దూర్వసన రావడం అలాగే ప్రజలు అనారోగ్యం పాలు అవడం జరుగుతుంది అని తక్షణమే సమస్య పై దృష్టి పెట్టాలని వివరించిన పిఎస్ఆర్,పివిఆర్ యువసేన మండల కో ఆర్డినేటర్ ఎస్కె ఖధీర్ సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్య పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య, సీపీఐ మండల కార్యదర్శి వాగబోయిన రమేష్, టీడీపీ మండల అధ్యక్షులు తోలెం సాంబయ్య, ముత్తాపురం మాజీ సర్పంచ్ పూనెం సమ్మయ్య, పల్లపు రాజేష్, బొంగు చంద్రశేఖర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.