
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని సీతారాముల ఆలయ ఆవరణలో 75 వ వన మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. పకృతితో ప్రతి ఒక్కరూ మమేకమై ఉండాలని, స్వచ్ఛమైన గాలి, వాతావరణం, పర్యావరణం మానవ మనుగడకు అతి ముఖ్యమని కావున పకృతిని బాధ్యతగా కాపాడుకోవాలని సూచించారు. ప్రజలందరూ వన మహోత్సవంలో తమ వంతుగా పరిసర ప్రాంతాలలో మొక్కలను నాటాలని కోరారు. అనంతరం అధికారులు, స్థానిక నాయకులు అందరూ కలిసి మొక్కలు నాటడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో డబ్బులు ఖర్చు చేసి మొక్కలను పంపిణీ చేయడం జరిగిందని, మొక్కలు నాటి వదిలేయకుండా వాటిని పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని నాటిన ప్రతి మొక్కను ఇంట్లో ఒక సభ్యుడుగా చూసుకోవాలని తెలిపారు. త్వరలోనే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని, రానున్న రోజుల్లో నేరుగా ప్రజల నే కలిసి వారి సమస్యలను పరిష్కరించే విధంగా తమ కార్యచరణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.