
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేందుకు కృషి : కాంగ్రెస్ నాయకురాలు
పట్నం సునీత మహేందర్ రెడ్డి
కూకట్పల్లి, జూలై 05 నేటి ధాత్రి ఇన్చార్జి
పదవిలో ఉన్న లేకున్నా ప్రజల కోసం తమ కుటుంబం పనిచేస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు.మల్కాజ్ గిరి ఓటర్లకు రుణపడి ఉంటా మని రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ నాయకురాలు పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు.వికారా బాద్ జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ గా పదవీ విరమణ చేసిన సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య క్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వ ర్యంలో పట్నం సునీత మహేందర్ రెడ్డిని ఘనంగా సన్మా నించారు.ఈ సందర్భంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి రాజకీయ పనితీరు,సేవా కార్యక్ర మాలు, అభివృద్ధి సంక్షేమ కార్య క్రమాలతో కూడిన అంశాలతో రూ పొందించిన రూపొందిం చిన సన్మాన పత్రాన్ని అందజేశారు.ఈ సంద ర్భంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడు తూ మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేసిన సందర్భంగా తనకు ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలకు సేవలు అందించేందుకు తాను ఎల్లప్పు డూ అందుబాటులో ఉంటానని ఈ సంద ర్భంగా హామీ ఇచ్చారు తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల అమలులో భాగంగా ప్రజలు ఎంతగానో సంతోషంగా ఉన్నారని తెలి పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ప్రజ లకు న్యాయం జరుగుతుందని ఈ సంద ర్భం గా తెలిపారు.తాము ఎప్పుడు కాంగ్రె స్ కార్యకర్తలకు అండగా ఉంటామ న్నా రు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్,దిండి అరవిం ద్ రెడ్డి,సం జీవరావు,మేకల మైకల్ చిన్న పాషా,అబ్దుల్ బాకీ నాగమ ల్లేశ్వరరావు, B బ్లాక్ అధ్యక్షరాలు రేష్మ, కూకట్పల్లి నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సంధ్యారాణి, పద్మ, సుందరి, రేణుక,యమునా,పొ డుగు అప్పారా వు ,ఫణీంద్ర కుమార్, రంగస్వా మి, మధు,లుంగీ రాజు,రాజు ముదిరాజ్, కొమ్ము బాబు, శేషగిరిరావు రాము, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.