
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అక్షర హైస్కూల్ విద్యార్థిని కోరే రిషిక 2024-25 విద్యాసంవత్సరానికి గాను నిర్వహించిన జేఎన్వి అర్హత పరీక్షలో సీటు సాధించారు. ఈసందర్భంగా విద్యార్థిని రిషికను కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ మినుకుల మునీందర్, డైరెక్టర్ మినుకుల రాధ, ఉపాధ్యాయ బృందం పూల గుచ్ఛం ఇచ్చి అభినందించారు. ప్రతి సంవత్సరం నవోదయలో సీటు సాదిస్తున్న అక్షర స్కూల్ యాజమాన్యాన్ని పలువురు తల్లిదండ్రులు, ప్రజలు అభినందించారు