
భూపాలపల్లి నేటిధాత్రి
మహాముత్తారం మండలంలో కెజిబివి పాఠశాల ఆకస్మిక పర్యటన
నీతి అయోగ్ గుర్తించిన వెనుకబడిన ప్రాంతాల జాబితాలో భాగమైన మహముత్తారం మండలం లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం పర్యటించారు. సంపూర్ణతా అభియాన్ కార్యక్రమం ప్రారంభం అనంతరం కెజిబివి పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మత్తు పనులు తనిఖీ చేశారు. పనుల్లో వేగం పెంచాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ నేలపై కూర్చొని భోజనం చేశారు.
జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థులు మంచిగా చదువుకొని సివిల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ వైద్యులు ఇలా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆయన పేర్కొన్నారు. వసతి గృహల్లోని విద్యార్థులకు మెరుగైన విద్య, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని, ఈగలు, దోమలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని
పేర్కొన్నారు. మండల ప్రత్యేక అధికారులు మండలాల్లోని వసతి గృహాలను తనిఖీ చేయాలని సూచించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని వేదల ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యాస్పి రేషనల్ ఫెలో గాయత్రి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, సిపిఓ శామ్యూల్, డిఆర్డిఓ నరేష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డిపిఓ నారాయణరావు, డీఈఓ రాజేందర్, సంక్షేమ అధికారి అవంతిక, డిపిఆర్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.