రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల ప్రత్యేక అధికారిగా కరీంనగర్ జిల్లా బిసి సంక్షేమ అభివృద్ధి అధికారి అనిల్ ప్రకాష్ కిరణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు ఎంపీపీ కార్యాలయంలోని ఛాంబర్ లో ఎంపీడీవో రాజేశ్వరి తమ సిబ్బందితో కలిసి మండల ప్రత్యేక అధికారికి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో ఎంపీఓ బండ రాజశేఖర్ రెడ్డి, ఏపీఓ రాధ, పిఆర్ఏఈ సచిన్, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.