
కాప్రా నేటిధాత్రి జూలై 04:
అధికారులు చిత్త శుద్ధితో పనిచేసి ఉప్పల్ నియోజకవర్గాన్ని రాష్ట్రం లోనే నంబర్ 1 నియోజకవర్గం గా తీర్చిదిద్దాలని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
గురువారం కాప్రా మున్సిపల్ కార్యాలయం లో కాప్రా సర్కిల్ డిసి ముకుంద్ రెడ్డి
అధ్యక్షతన ఏర్పాటు చేసిన అన్ని విభాగాల సమీక్ష సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారులు అందరూ తమ డివిజన్ల లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష సోమ శేఖర్ రెడ్డి ,హెచ్ బీ కాలనీ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్ ,మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ,మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు ,శ్రీనివాస్ రెడ్డి పాటు వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.