భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దళిత హక్కుల పోరాట సమితి డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డి హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరాఠీ కాంతారావు, రాసపల్లి భద్రయ్య లు మాట్లాడుతూ అర్హులైన వారందరికీ వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని గత పది సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దళితవాడల్లో ఎస్సీ సబ్ ప్లాన్ కింద మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న దళితులందరికీ పట్టాలు ఇవ్వాలని, దళితులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములకు సీలింగ్ యాక్ట్ తొలగించాలని, ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలని కోరారు. కొత్తగా కార్పొరేషన్ నుండి రుణాలు మంజూరు చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి.హెచ్.పి.ఎస్ జిల్లా నాయకులు నేరెళ్ల జోసఫ్, పొనగంటి లావణ్య, పీక రవికాంత్, బౌద్ధ కమలాకర్, పెద్దమామల సంధ్య తదితరులు పాల్గొన్నారు..