
మహాదేవపూర్- నేటి ధాత్రి:
పవిత్ర పుణ్యక్షేత్రమైన కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఆలయ హుండీ ఆదాయం ఏడు రోజులకు గాని 21,4464 రూపాలు వచ్చాయని ఆలయ అధికారి మారుతి తెలిపారు. బుధవారం రోజున గత ఏడు రోజుల నుండి భక్తులు స్వామివారికి అందించిన కానుకలకు సంబంధించి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఉండి లెక్కింపు కార్యక్రమం ఈవో ప్రసాద్ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులతో పాటు అన్నమాచార్య రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొనడం జరిగిందని ఈవో మారుతి తెలిపారు.