
@వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
నేటిధాత్రి, వరంగల్
బాలల సంరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. బాల కార్మికుల వెట్టిచాకిరి నుండి విముక్తియే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా, జులై 1వ తేది నుండి జులై 31వ తేది వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ 10వ విడత పోస్టర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం ఆవిష్కరించారు. పోలీసు మరియు వివిధ ప్రభుత్వ శాఖలు మరియు ప్రభుత్వ ఎన్జీఓ ఇతర ఎన్జీఓ సంస్థలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో బాల కార్మికులతో పాటు, వేధింపులకు గురైన బాలలను గుర్తించడము, ఆశ్రమాలలో ఆచూకీ తెలియకుండా ఉన్న బాలలను గుర్తించి, వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో అట్టి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకై పనిచేసి పిల్లల పట్ల ఎవరైనా కఠినంగా వ్యవహరించినట్లయితే వారి పైన తగిన చర్యలు చేపట్టాల్సిందిగా పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, హనుమకొండ, వరంగల్, జనగాం జిల్లాలకు చెందిన బాలల సంరక్షణ సమితి చైర్ పర్సన్స్ దామోదర్, వసుధ, ఉప్పలయ్య, బాలల పరిరక్షణ అధికారులు ప్రవీణ్, రాజు, రవికాంత్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్స్ భాస్కర్, శ్వేత, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, డైరెక్టర్ సిస్టర్ సహాయ, షేర్ ఎన్జీవో ప్రతినిధులు శిరీష, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏ.ఎచ్.టి.యు సిబ్బంది పసియోద్దీన్, మల్లేష్, భాగ్యలక్ష్మి, శ్రీనివాస్, రామారావుతో పాటు మూడు జిల్లాలకు చెందిన పోలీస్, లేబర్ శాఖ అధికారులు పాల్గొన్నారు.