
#అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
#బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి.
నల్లబెల్లి, నేటి ధాత్రి: గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మండలంలో మంజూరై సగం పనులు పూర్తిచేసిన రోడ్లను వెంటనే బీటీ రోడ్డు వేసి పూర్తి చేయాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంతో చొరవ తీసుకొని గ్రామ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండాలని ఉద్దేశంతో ప్రత్యేక నిధులను మంజూరు చేయించి టెండర్ల ద్వారా పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు సదర్ కాంట్రాక్టర్లు పనులను పూర్తి చేయడంలో నిమగ్నం అవ్వగా ఎన్నికల కోడ్ రావడంతో పనులు సగం లోనే ఆగిపోయినాయి కొత్తగా ఏర్పడి ప్రభుత్వం 8 నెలలు కావస్తున్న ఇప్పటివరకు మండల ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో చిత్తశుద్ధి కనపరచకపోవడం వారి పాలన వైఫల్యానికి నిదర్శనమని ప్రజల సమస్యలపై స్పందించాల్సిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టకపోవడం విడ్డూరంగా ఉందని వర్షాకాలం కావడంతో రోడ్లపై ప్రయాణించేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికైనా ప్రజల ఇబ్బందిని గుర్తించి మంజూరు చేసిన బీటీ రోడ్లను, సిసి రోడ్లల పనులను సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వెంటనే రోడ్లను పూర్తి చేసే విధంగా కృషి చేయాలని లేనియెడల ప్రజల పక్షాన పోరాటం చేయడం తప్పదని ఆయన డిమాండ్ చేశారు.