
భద్రాచలం నేటి ధాత్రి
మాల మహానాడు డిమాండ్.స్థానిక ఏఎంసీ కాలనీ నందు మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశ ఉద్దేశించి మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్ మాట్లాడుతూ…. అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నిస్వార్థపరుడైన శ్రీరాముల శ్రీనివాస్ పై ఉన్నత అధికారులతోపాటు నలుగురు కానిస్టేబుల్ ల వేధింపుల వల్ల మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడని ఆవేదన వ్యక్తపరిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ ప్రజాదరణ పొందుతూ సేవలందించిన ఒక దళిత ఎస్సై పై కక్ష సాధింపు చర్యగా కుల వివక్షత వేధింపులు చేయడం బాధాకర విషయమని అన్నారు. దళిత ఎస్సై పై కుల వివక్షత చూపిస్తూ తన ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుండా మానసిక ఒత్తిళ్లు గురి చేస్తూన్న అశ్వరావుపేట పోలీస్ ఉన్నతాధికారులపై మరియు ఆ నలుగురు కానిస్టేబుల్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు పెట్టి విధుల నుంచి బహిరస్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని దళిత సంఘాలతో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు పుట్టి రవి , మొరంపల్లి రాము , రామకృష్ణ ,ఏసు, శాంతిరాజు, సాయి, నరేషు ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు