#ప్రజా తీర్పు నుంచి బిజెపి గుణపాఠం తీసుకోవాలి.
#ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా.
నర్సంపేట / వరంగల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక విధానాలను చట్టాలను ఉపసంహరించుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఎంసిపిఐ(యు) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా కేంద్ర నూతన న్యాయ చట్టాలను ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వరంగల్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ కు మెమోరాండం ఇచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వచ్చిన బిజెపి సారథ్యంలోని యన్ డి ఎ కూటమి గత 17వ పార్లమెంటులో 303 సీట్లు కలిగి కూటమి 350 పైగా స్థానాలు ఉండి అనేక ప్రజావ్యతిరేక చట్టాలను, నిర్ణయాలు అమలు పూనుకున్నది అన్నారు.ముఖ్యంగా అత్యంత నిరంకుశ పద్దతుల్లో జూలై 1 నుంచి అమలు చేయనున్న క్రిమినల్ లా చట్టాలు అందులో భాగమేనని, రాష్ట్రాల హక్కులను హరించే జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి చెందిన యాక్ట్ 370 రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టి రాష్ట్రాన్ని విభజించిందన్నారు.2022 గిరిజనుల చట్టాలను సవరించే నూతన అటవి చట్టాలను తీసుకుని వచ్చిందని ఇలా తనకు తిరుగులేదని గతంలో సాగించిన మనువాద కార్పొరేట్ ఫాసిస్టు పాలనకు 18వ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం నేర్పారని ఆరోపించారు. ఈ క్రమంలో అధికారంలో రావటానికి కావాల్సిన సాదారణ మెజారిటీ 272 కన్న 240 స్థానాల్లో మాత్రమే బిజెపి గెలిచిందని, గతంలో కూటమి 350 పై స్థానాల నుంచి 293 స్థానాలకు తగ్గిందని ప్రజలు కొట్టిన దెబ్బకు బిజెపి మైనారిటీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.ఈ నేపథ్యంలో బిజెపి యన్డిఎ కూటమి ప్రజా విశ్వాసం పూర్తిగా తగ్గిందనట్లు తేటతెలమైనందన్నారు.గత 17వ పార్లమెంటులో చేసిన ప్రజా వ్యతిరేక చట్టాలను, నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని యంసిపిఐ(యు) డిమాండ్ చేస్తుందన్నారు. అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు తక్షణమే పూనుకోవాలని కోరారు. లేకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గోనె కుమారస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంద రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు, నాగేల్లి కొమురయ్య, వంగల రాగసుధ, కనకం సంధ్య, జిల్లా నాయకులు సుంచు జగదీశ్వర్, కందికొండ కుమారస్వామి, జన్ను రమేష్, అప్పనపురి నరసయ్య, మాలి ప్రభాకర్, బత్తిని కుమారస్వామి, మార్త నాగరాజు, పరిమళ గోవర్ధన్, రాజు, ఉడుత గణేష్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.