మిత్రుని కుటుంబానికి ఆర్థిక చేయూత

వేములవాడ రూరల్ నేటి ధాత్రి

వేములవాడ రూరల్ మండలంలో ని చెక్కపల్లి గ్రామానికి చెందిన చందనం రాములు గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు బండి మీదకెళ్లి పడడం తో అతని కాలు పలు చోట్లా విరిగి న నేపధ్యంలో అతని ఆర్థిక పరిస్థితులు మంచిగా లేనందున తోటి చిన్న నాటి స్నేహితులు ఆపదలో ఉన్న సహచర మిత్రుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని తోడ్పాటునందించిన మిత్రులు తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు.

చెక్కపల్లి గ్రామంలో వడ్రంగి పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్న రాములును విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రమాద తీవ్రత ఎక్కువ ఉండడంతో అతని కాలు నాలుగు అక్కల విరగడం తో అతని ఆర్థిక పరిస్థితులు మంచిగా లేనందున
ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన సహచర మిత్రులు తమ మిత్రుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో
చిన్న నాటి మిత్రులు
అందరూ కలిసి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.
శనివారం రాములు చిన్న నాటి స్నేహితులు పొగుల వేణు మంచాల రామ స్వామి బొంగురపు తిరుపతి రెడ్డి పిట్టల రమేష్ దుంపేట మనోహర్ పొన్నం నాగేందర్ పొన్నం మల్లేశం కోడం కనకయ్య బండారి శ్రీధర్ అడ్డిక సంతు పటేల్ వారి ఇంటికి వెళ్లి రూ 21,300 రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేసి వారిని పరామర్శించారూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *