
చిట్యాల నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని భీష్మ నగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ న్యాసాని మనోహర్ రావు ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు శగండ్ర సత్యనారాయణ రావు* పాల్గొనారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయున్ని ఘనంగా సన్మానించడం జరిగింది .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంకితభావం, సచ్చిలత, వృత్తి పట్ల గౌరవం కలిగిన ఆదర్శ ఉపాధ్యాయుడు మనోహర్ రావు అని, ఇంత గొప్ప ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ చెందడం విద్యార్థులకు, గ్రామానికి తీరని లోటు అని తెలుపుతూ.., ప్రతి ఉద్యోగికి విరమణ తప్పదు కాబట్టి వారి యొక్క శేష జీవితం ఆయురారోగ్యాలతో వారి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆశీస్సులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రేగురి సుభాకర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ గారు మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఊర్మిళా రెడ్డి, మొగుళ్ళపల్లి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పింగిలి విజయపాల్ రెడ్డి పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్, ఉపాధ్యాయురాలు మంజుల మేడం లతోపాటు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.