
# ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్
నర్సంపేట,నేటిధాత్రి :
ఏబిఎస్ఎఫ్ పోరాట ఫలితంగానే మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ నియమించారని ఏబిఎస్ఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల,కళాశాల కళాశాలలో రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవడం వలన గురుకుల పాఠశాలలో పర్యవేక్షణ లోపించి విద్యార్థులకు నాణ్యతమైన విద్యతోపాటు రుచికరమైన భోజనం అందలేకపోవడం వలన విద్యార్థులు ఇబ్బంది పడుతూ విద్యను అభ్యసిస్తున్నారని ఈ క్రమంలో ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 2022 సెప్టెంబర్ 3 న హైదరాబాద్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల కళాశాల కార్యాలయం ముందు నిరసన తెలియజేసి అనంతరం అప్పటి బీసీ సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టులకు వినతి పత్రం అందజేశామని అన్నారు.ఆ సమస్యపై ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల కళాశాల పాఠశాలలో రెగ్యులర్ ప్రిన్సిపాల్ నియమించిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , మహాత్మ జ్యోతిరావు పూలే గురుకులాల కార్యదర్శి సైదులు లకు ఏబిఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, భూషణ్, పటేల్ రాజు, కృష్ణ, రవీందర్, సురేష్, గోపి,మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.