
ఆపదోస్తే అన్ని విధాల ఆదుకుంటానని మృతుల కుటుంబీకులకు భరోసా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని బంగ్లాపల్లి గ్రామానికి చెందిన గోనెల అశోక్ కుమార్తె వర్ష మరియు అదే గ్రామానికి చెందిన అనుముల మోహన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు శనివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి..ఓదార్చారు. మృతిచెందిన వారి చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ఏ ఆపదోచ్చిన..కష్ట కాలంలో వారి కుటుంబాలకు అండగా ఉండి..ఆదుకుంటానని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే జీఎస్సార్ పరామర్శతో మృతుల కుటుంబాలకు ఎంతో మనోధైర్యం కలిగిందని గ్రామస్తులు తెలుపడం గమనార్హం. ఎమ్మెల్యే గండ్ర వెంట కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి పున్నం చందర్ రావు, ఆకుతోట కుమారస్వామి నల్లాల లింగారెడ్డి, మంద సుధాకర్, ఎండి రఫీ, నీరటి మహేందర్, కరాబు యువరాజు తదితరులు పాల్గొన్నారు.