సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.
భూపాలపల్లి నేటిధాత్రి
మొగుళ్ళపల్లి టేకుమట్ల చిట్యాల మండలాల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులలో ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ వినియోగదారులకు మంచినీటి సౌకర్యం కానీ బాత్రూం సౌకర్యం గాని వెహికల్స్ కు గాలి సౌకర్యం గాని ఎక్కడ కూడా ఏర్పాటు చేసిన దాఖలు కనబడడం లేదు వినియోగదారులు ఎన్ని ఇబ్బందులు పడిన బంకు యజమానులు మాత్రం పట్టించుకున్న దాఖలు లేవు గాలి నీరు టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా సౌకర్యం కల్పించకుండా వాళ్ల ఇష్టానుసారంగా బంకులు నడుపుతున్నారు ఒక లీటర్ పెట్రోల్ కనీసం 50-60 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వాలి కానీ ఈ మూడు మండలాల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులలో ఎక్కడ కూడా అంత మైలేజ్ రావడం లేదు అంటే కల్తి జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు వాళ్ల దందా మాత్రం మూడు పూలు ఆరు కాయలుగా విలసిల్లుతుంది తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ మూడు మండలాల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులలో తనిఖీలు నిర్వహించి ఈ బంకులు సీల్ చేయాల్సిందిగా లైసెన్సులు రద్దు చేయాలని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటిపైన చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం డీజిల్ కూడా కల్తీ మయంతో కొనసాగుతోంది దింతో వినియోగదారులు నష్టపోతున్నారు ఒకపక్క ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచుతున్నారు ఎటుచూసినా ప్రజల నష్టపోతున్నారు తప్ప వీరికి న్యాయం జరిగింది ఎక్కడ లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.