
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం నరసింహుల పల్లె గ్రామంలో రైల్వే లైన్ వస్తున్నందున గ్రామంలో రైతులకు ఇప్పటికి నష్టపరిహారం ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో 168.. 169.. సర్వే నెంబర్లలో10. పరికరాల భూమిని రైల్వే లైన్ కోసం రెవెన్యూ అధికారులు సేకరించి చెక్కులు పంపిణీ చేశారని కానీ 168 సర్వేనెంబర్ లో గల ఉన్న మూడు బావులు ఒక బోర్వెల్ కు చెక్కులు రెవెన్యూ అధికారులు ఇవ్వడం లేదని వాటికోసం ఎమ్మార్వో ఆర్డీవో ఆఫీసుల చుట్టూ ఆరు నెలలుగా తిరుగుతున్నామని ఎమ్మార్వో ని కలిస్తే ఆర్డిఓ కి ఆర్డిఓడి కలిస్తే ఎమ్మార్వో కి అని తిప్పుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గురువారం రోజున రైల్వే అధికారులు భూములలో పనులు మొదలు పెట్టారని ప్రభుత్వం కేటాయించిన డబ్బులు ఇవ్వకుండా పనులు ఎలా మొదలు పెడతారని రైతులు ప్రశ్నిస్తే రైల్వే అధికారులు మీపై పోలీస్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని సంబంధిత ప్రభుత్వ అధికారులను రైతులు వేడుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు నష్టపరిహారం ఇవ్వాలని వారు కోరుచున్నారు