
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం కేంద్రంలో కూడలి వద్ద 103వ జయంతి వేడుకను దేశ మాజీ ప్రధాని విప్లవాత్మక ఆర్ధిక సంస్కరణల మార్గదర్శి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని, పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పునాదులు వేశారని గుర్తుచేశారు. ఏ పదవి చేపట్టినా దానికి వన్నె తీసుకొచ్చారని అన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో గురుకుల విద్యను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నవోదయ పాఠశాలలను ప్రారంభించి, జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సమ యంలో ఓపెన్ జైల్ అనే పద్ధతికి శ్రీకారం చుట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కి ఎన్నో సేవలు చేసి స్వాతంత్రం కోసం గొప్ప మహానీయుడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నేతలు, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.