
భద్రాచలం నేటి ధాత్రి
మహాజన సమితి ఆదివాసి మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కంగాల రమణకుమారి ఆధ్వర్యంలో భద్రాచలం తాసిల్దార్ కి అక్రమ ఇసుక నిల్వలను అరికట్టాలని మెమోరాండం ఇవ్వటం జరిగింది. మెమోరండం అందించిన అనంతరం కంగాల రమణకుమారి మాట్లాడుతూ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ ఇసుక నిల్వలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తపరిచారు పట్టణంలో వివిధ కాలనీలో అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్లు అధిక స్పీడుతో కాలనీలలో శబ్దాలు చేస్తూ తమ ఇష్టానుసారంగా నడుపుతున్నారని డాక్టర్ల వల్ల అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయని ఆమె తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో పిసా చట్టం ప్రకారం ఆదివాసులతో గ్రామసభ నిర్వహించి ఆ సభల ద్వారా ఇసుకరీచులను ఏర్పాటు చేయాల్సి ఉండగా అది జరగవు పోవటం వలన ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని చట్టాలను తమ ఆధీనంలోకి తీసుకొని యదేచుగా అగ్రవర్ణ బడా వ్యాపారస్తులు భద్రాచలంలో అక్రమంగా ఇసుకను రవాణా చేసి కాలి స్థలాల్లోడంపింగ్లను ఏర్పాటు చేస్తున్నారని ఇసుకను గుట్టలు గుట్టలుగా పోస్తూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అడిగిన వారి పైన పరోక్షదారులకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు ఏజెన్సీ చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని ఇసుక ట్రాక్టర్ల యజమానులు సిండికేట్ గా ఏర్పడి ఇసుక మాఫియాను కొనసాగిస్తున్నారని భద్రాచలం తాసిల్దార్ కి విన్నవించారు. తాసిల్దార్ శ్రీనివాస్ స్పందించి అక్రమ నిల్వలను అరికడతానని చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి పైన చట్టపరమైన చర్యలు ఉంటాయని తాసిల్దార్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు ఈ మెమోరాండం ఇచ్చిన వారిలో మహాజన సమితి మహిళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు పలక ఆదిలక్ష్మి పాల్గొన్నారు.