
నెక్కొండ, నేటి ధాత్రి:
మండలంలోని ముదిగొండ గ్రామానికి చెందిన ముగ్గురిని భూమి తగాదాలలో అరెస్టు చేసి డిమాండ్ కు పంపినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే ముదిగొండ గ్రామానికి చెందిన ఎట్లా ఉప్పలయ్య కు ఇద్దరు భార్యలు మొదటి భార్య కు కొడుకు, కూతురు, రెండవ భార్యకు ఒక కొడుకు ఉండగా ఉప్పలయ్య వారందరికీ సమానంగా ఆస్తుల పంపకం చేయగా ఉప్పలయ్యకు 30 గుంటల భూమి ఉంచుకున్నాడు ఇట్టి భూమిపై రెండవ భార్య యాకమ్మ, కుమారుడు అశోక్ , కోడలు హేమలత, కొన్ని సంవత్సరాల నుండి ఉప్పలయ్య ఆస్తి కూడా తమకు రావాలని తరచూ గొడవలు పడుతుండే వారిని ఈ విషయంలో రెండవ భార్య యాకమ్మ, అశోక్, హేమలత ఉప్పలయ్య పొలం వద్ద సర్వే చేయించి హద్దులు నాటుతుండగా ఉప్పలయ్య వెళ్లి ఆపగా అతని కాళ్లకు నడుముకి మెడకు తాడు కట్టి అతని చంపాలనే ఉద్దేశంతో తాడుతో కొంత దూరం లాక్కెళ్ళినట్టు బాధితుడు ఎట్లా ఉప్పలయ్య తమకు దరఖాస్తు చేయగా వెంటనే విచారణ జరిపి ముగ్గురిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్ కు పంపినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. అనంతరం ఎస్సై మహేందర్ మాట్లాడుతూ భూమి తగాదాలను సామరస్యంగా లేదా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. భూమి తగదా విషయాల్లో ఎలాంటి గొడవలు జరిగిన చట్టరీత్య చర్యలు చేసుకుంటామని అన్నారు.