
లక్షటిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి:
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు లక్షెటిపేట పోలీసులు పట్టణంలో ఈరోజు ఇంటర్నేషనల్ ఆంటీ డ్రగ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ డే ను పురస్కరించుకుని లక్షెట్టిపెట పట్టణంలో యువత,విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుండి ఉత్కూర్ చౌరస్తా వరకు సాగింది. ఈసందర్భంగా లక్షెట్టిపేట సిఐ నరేందర్ మాట్లాడుతూ ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు, గంజాయి లాంటికి అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వాటికి అలవాటు పడకూడదన్నారు. మత్తుపదార్థాల నిర్మూలనకై పోలీసులు ఉక్కుపాదం వేస్తున్నారని రాష్ట్రములో మత్తుపదార్థాల చలామణి లేకుండా చూడటమే బాధ్యతగా ముందుకు సాగుతున్నామన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలని తెలుపుతూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట ఎస్సై చంద్రకుమార్, ఎస్సై-2 రామయ్య తో పాటు పోలీస్ సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాద్యాయులు, యువకులు పాల్గొన్నారు.