ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాల బంద్ సంపూర్ణం

లక్సెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి:

విద్యారంగంలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు లాకావత్ ఈశ్వర్ నాయక్ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్య సంస్థల బంద్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏబీవీపీ నాయకులు లక్షెట్టిపేట పట్టణంలోని పలు విద్యాసంస్థలను మూసి వేయించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన పాఠశాలలో సమస్యలు పరిష్కారం కాలేదని విద్యార్థులకు ఇంకా కొత్త పాఠ్యపుస్తకాలు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!