
కరీంనగర్ : ధర్మారంలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మతల్లి బోనాలను ధర్మారం ముదిరాజ్ సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు పోలు బిక్షపతి, పోలు వెంకటేష్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. మహిళలు బోనాలు ఎత్తుకొని డీజే,డప్పు,చప్పులు శివసత్తుల పూనకాల మధ్య పురవీధుల గుండా పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించారు
ఈ కార్యక్రమంలో పోలు రాజు, పొలు మహేందర్, నెల్లి సంపత్, బండి విరస్వామి,గొడుగు సుధాకర్, నెల్లి చంద్రమోగిలి, పొలు భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.