జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకపోవడం మూలంగా టేకుమట్ల మండల ప్రజలు చిట్యాల మొగుళ్లపల్లి పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కార్డు ఆఫ్ డేట్ చేయాలన్న ఆధార్ కార్డులో డేటాఫ్ బర్త్ తప్పు పడిన పేరు తప్పు పడిన ప్రజలు ఇతర మండలాలకు ఎన్నో వ్యయ ప్రయాసలకు అక్కడా పని కాక పట్టణాలకు వెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్నారు టేకుమట్ల మండలానికి ఆధార్ కేంద్రం మంజూరైన ఇప్పటివరకు ప్రారంభించడం లేదు టేకుమట్ల మండలం కేంద్రంలో తక్షణమే ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఉన్నటువంటి మీసేవ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.మండల కేంద్రంలోమీసేవ చుట్టూ ప్రజలు అలసిపోతా ఉన్నారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ స్పందించి ఆధార్ కేంద్రం ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టి ప్రజలకు సర్వీస్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం