
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలంలోని బాంజిపేట గ్రామంలో గల ముదిరాజ్ కులస్తులు వారి కులదైవం పెద్దమ్మతల్లికి బుదవారం మొక్కులు చెల్లించుకున్నారు.వర్షాకాలం మొదలు కావడంతో వారి పంటలు బాగా పండాలని కోరుతూ బోనాలు,గొర్రె పొట్టెల్లను సమర్పించారు.అనంతరం వారివారి కుటుంబాలతో వనభోజనాలకు తరలివెళ్లారు.ఈ కార్యక్రమంలో భూషబోయిన రమేష్,భూషబోయిన ప్రవీణ్,భూషబోయిన రాజు,సునీల్,కొమురయ్య,భీమగాని రాజమౌళి,నరసింహ,వీరన్న తదితరులు పాల్గొన్నారు.