
సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం కూడలి వద్ద బుధవారం జాతీయ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు మాట్లాడుతూ నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకులు భారతదేశాన్ని ప్రగతిశీల భవిష్యత్తు వైపు నడిపించగలిగే ఏకైక వ్యక్తి.,యువతరానికి ఆదర్శం రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను బుధవారం జరుపుకోవడం సంతోషకరం.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కూడలి వద్ద కేక్ కట్ చేసి,ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు, మండల యూత్ కమిటీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.