
ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన యూత్ నాయకులు
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణం లో
బుధవారం రోజున ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పరకాల పట్టణం లోనీ ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది.వారు మాట్లాడుతూ త్యాగాలు కుటుంబం లో పుట్టిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీరు వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారతోడో యాత్ర చేసి పేద,మధ్య తరగతి ప్రజల కష్టాలను తెలుసుకొని వారి కోసం పోరాటం చేసిన నాయకుడు అనీ వారు అన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్,జిల్లా నాయకులు అల్లం శ్రీరామ్ కుమార్,యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి రాంప్రసాద్,పట్టణ కార్యదర్శి బాసని సుమన్,బొచ్చు అనిల్,బొచ్చు రాజు,సాయి కృష్ణ,రమేష్,ఆరిఫ్ పాషా చరణ్ తదితరులు పాల్గొన్నారు.