విలేకరుల పిల్లలకు ఉచిత విద్య అందించాలి

డీఈవో కు వినతి పత్రం ఇచ్చిన టియుడబ్ల్యుజే ఐజేయు
వనపర్తి నేటిధాత్రి :– ప్రైవేట్ పాఠశాలల్లో విలేకరుల పిల్లలకు ఉచిత విద్య అందించే విధంగా కృషి చేయాలని టియుడబ్ల్యుజే ఐజేయు వనపర్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు డీఈవో కార్యాలయంలో మంగళవారంనాడు డి ఇ ఓ గోవిందరాజులు కు వినతిపత్రం అందజేశారు. గత సంవత్సరం మాదిరిగా 2024 -25 విద్యాసంవత్సరానికి ప్రతి ప్రైవేటు పాఠశాలల్లో విలేకరుల పిల్లలకు ఉచిత విద్య అందే విధంగా చూడాలనీ , ప్రతి పాఠశాలకు ఉచిత విద్యపై సర్కులర్ జారీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు . సానుకూలంగా స్పందించిన డీఈవో గోవిందరాజులు రెండు మూడు రోజుల్లో ప్రతి విలేకరి పిల్లలకు ఉచిత విద్య అందే విధంగా సర్కులర్ జారీ చేస్తానని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో సీ నియర్ జర్నలిస్టు టీయూడబ్ల్యూజే ఐజేయు మాజీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు మల్యాల బాలస్వామి, విలేకరులు వనపర్తి జిల్లా ఎడ్యుకేషన్ కన్వీనర్ కుమార్, సీల్ మూర్తి ఆంజనేయులు, తిరుపతయ్య ,ముంత రవి యాదవ్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!