జమ్మికుంట :నేటిదాత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో దర్గాకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ రాష్ట్రంలో పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం..
ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ గారు
జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గా లో మంగళవారం రోజున ఉర్సు ఉత్సవాలు భాగంగా గంధాలను తీసుకువచ్చి హజ్రత్, సయ్యద్ ఇంకుషావలి సమాదులకు వస్త్రాలు సమర్పించరు.
ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ బిజిగిరి షరీఫ్ దర్గాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని
ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని ఇక్కడికి భక్తులు కులాలకు, మతాలకు, అతీతంగా ఇక్కడికి వచ్చి ముక్కులు చెల్లించుకుంటారని కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం , విశ్వాసంతో ఇక్కడికి వస్తున్నారు.
వచ్చిన భక్తులకు దర్గా కమిటీ వారు సహకల సౌకర్యాలు కల్పిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
బాబా ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వుండాలని నియోజకవర్గంలోని ప్రజలంతా పాడి పంటలు సమృద్ధిగా ఎదగాలని దేవుని కోరుకున్నానని అన్నారు.
వోడితల ప్రణవ్ వెంట దర్గా కమిటీ సభ్యులతో పాటు
కాంగ్రెస్ నాయకులు పొన్నగంటి మల్లయ్య,కొల్లూరు కిరణ్, సుంకరి రమేష్, సజ్జు, మోలుగురి సదయ్య, సతీష్ రెడ్డి, పుల్లూరి సదానందం, సంపత్,రాహుల్, నాగభూషణం,కొమరయ్య, రాజకుమార్, రాచపల్లి రమేష్, వెంకటరెడ్డి, రాందాస్, రాములు, మల్లేష్ ,తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.