ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలి

ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్

పరకాల నేటిధాత్రి
విద్యా పేరుతో వ్యాపారం చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలలో అధిక ఫీజుల వస్తువులను నిలిపివేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ డిమాండ్ చేశారు.ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం జీవోలు విడుదల చేసిన అవి అమ్మలకు మాత్రం నోచుకోవడం లేదు. ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు తమకు ఇష్టానుసారంగా ప్రతి ఏటా 30 నుంచి 40% ఫీజులు పెంచుకుంటూ పోతున్నారని. దీంతో తల్లిదండ్రులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అనేకసార్లు ప్రభుత్వము అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకున్న దాఖలాలు లేవు అన్నారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేటు విద్యాసంస్థలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాము.డీజీ,టెక్నో కాన్సెప్ట్,ఐఐటి,కరికులం పేర్లతో అధిక ఫీజులు దండుకుంటున్నారు. అక్షరాలు నేర్పేందుకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్న స్కూల్ లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.ఇప్పటికే ప్రభుత్వం పాఠశాలలో ఎలాంటి విక్రయాలు చేయకూడదని చెప్పినప్పటికీ యదేచ్చగా అమ్ముతున్నారు. ప్రైవేటు యజమాన్యాలు పాఠశాలల్లోనే మెటీరియల్స్ అమ్ముకునే ఆధునిక దుకాణాలుగా మార్చుకున్నారు.ఫీజుల నియంత్రణ కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఫీజు రెగ్యులరేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు పెంచుకోవాలంటే తల్లిదండ్రులు సమక్షంలో నిర్ణయించాలని కానీ అదే మీ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ పట్ల దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!