లింగాల ఘనపూర్ (జనగామ )నేటి ధాత్రి :-
లింగాల గణపురం మండలo నవాబుపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న 2004-05 బ్యాచ్ లో రిజ్వాన అనే స్నేహితురాలికి క్యాన్సర్ రావడంతో పూర్వ విద్యార్థులందరూ కలిసి మన స్నేహితురాలికి ఎలాగైనా సహాయం చేయాలని అనుకుని అందరూ కలిసి 34 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.స్నేహితురాలికి చేతనందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బాల్య సతీష్ చిటుకల అశోక్, పిల్లి భరత్, పెండ్లి అశోక్,గైని సంపత్,బోట్ల శారద బండ శీను, గండి ప్రవీణ్, చిలుక నరేష్, బేతి భాస్కర్ మిగతా విద్యార్థులు అందరూ పాల్గొన్నారు.