
ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన యువ వికాసం హామీ తక్షణమే అమలు చేయాలి
ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్లులను తక్షణమే మంజూరు చేయాలి
ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్
తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా హుజరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కోసం అలుపెరుగని పోరాటాలు చేసి చివరికి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రాణత్యాగం చేసుకొని తెలంగాణ రాష్టం సాధించుకుంటే గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని కొత్త ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి తగిన న్యాయం చేయాలని అన్ని రంగాలను అభివృద్ధి చేయాలని ముఖ్యంగా విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు భర్తీ చేసి యువకుల కు మనోధైర్యం నింపాలని డిమాండ్ చేశారు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన 6గ్యారంటీలలో ముఖ్యంగా యువవికాసం తక్షణమే ఈ విద్యా సంవత్సరమే అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గుర్తించి రానున్న రోజుల్లో అన్ని రంగాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచేందుకు తగిన కృషి చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ నాయకులు దుర్గం బాలు నాయిని జనార్దన్ మాతంగి ఆర్య సాగర్ భువన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు