
ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు
భద్రాచలం నేటి ధాత్రి
బక్రీద్ పండుగను పురస్కరించుకొని భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీలో ఉన్న ఈద్గాలో వేలాది మంది ముస్లిం సోదరులు సోమవారం బక్రీద్ నమాజ్ ప్రార్ధనలు చేశారు.ఈ సందర్బంగా మత పెద్దలు మాట్లాడుతూ… త్యాగం, స్నేహం, పవిత్రత, దయ గుణానికి ప్రతీకగా నిలిచిన పవిత్రమైన రోజు బక్రీద్ అన్నారు. ఇబ్రహీం సలాం వృద్ధాప్యంలో లేక లేక ఒక పుత్రుడు జన్మిస్తే ఆ పుత్రుడునీ కుర్బాని చేయాలని అల్లా ఆదేశిస్తే ఆయన వెంటనే అల్లా ఆజ్ఞని పాటిస్తూ కుమారునికి కుర్బానీయటానికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అలాంటి త్యాగానికి ఒడిగట్టిన ఇబ్రహీం సలాం దానికి ప్రత్యేకగానే ముస్లిం సోదరులందరూ కూడా బక్రీద్ రోజు పొట్టేలు గాని, మేకపోతు గాని కుర్బానీ చేసి మూడు భాగాలు చేసి ఒక భాగము పేదవారికి, ఒక భాగం బంధువులకి, మరొక భాగము కుర్బానీ ఇచ్చినారు ఉంచుకోవడం జరుగుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో హిందూ, ముస్లిం భాయ్ బాబుగా ఉండాలని, ఎలాంటి హింసలకి తావు రాకూడదని ఖురాన్ లో గాంధీ మార్గమే రాసి ఉన్నదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు షఫీ, అబ్దుల్లా, మునాఫ్, షేక్ అజీమ్, సర్ఫరాజ్, అలీ భాష, అక్బర్, సిందా, షరీఫ్, అలీమ్ ఖాన్, సలీం రహీం, నవాబ్,రఫీ తదితరులు పాల్గొన్నారు