
అంగరంగ వైభవంగా సాయిబాబా దేవాలయంలో 13వ వార్షికోత్సవ వేడుకలు
గౌరీభట్ల శంకర్ శర్మ సిద్ధాంతి, అనిల్ శర్మ సిద్ధాంతి
చేర్యాల నేటిధాత్రి…
చేర్యాల మండల పరిధిలోని చిన్న షిరిడీగా పిలువబడే పోతిరెడ్డిపల్లి గ్రామంలో 13వ సాయిబాబా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా, కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు గౌరీభట్ల శంకర్ శర్మ సిద్ధాంతి, అనిల్ శర్మ సిద్ధాంతి గార్లు తెలిపారు ఈ సందర్భంగా గౌరీభట్ల శంకర్ శర్మ మాట్లాడుతూ సాయిబాబా ఆలయంలో 13వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయమే సుప్రభాత సేవ, స్వామివారికి అలంకరణ, అభిషేకం, హారతి, స్వామివారికి మహా నివేదన, మంత్రపుష్వములు తదితర కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు విట్టలయ్య, కత్తుల మాధవరెడ్డి, బట్టు మోహన్ రెడ్డి, కత్తుల భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.