
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం దుబ్బపల్లి గ్రామ శివారులోని మోరంచవాగు పరివాహక ప్రాంతంలోని పంటలు వచ్చే వర్షాకాలంలో మునగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జెన్కో అధికారులకు సూచించారు ఈరోజు జిల్లా కలెక్టర్ కలెక్టర్ భవేష్ మిశ్రా జెన్కో సీఈ ఇతర అధికారులతో కలిసి ముంపు పంటలను పరిశీలించారు భారీ వర్షాలతో మోరంచపల్లి గ్రామం మునగకుండా చర్యలు చేపట్టాలని ప్రతీ ఏటా ముంపుకు కారణమవుతున్న అక్కడున్న జామాయిల్ తోటను పూర్తిగా తొలగించి మోరంచవాగులో పూడిక తీత పనులు చేపట్టాలని కోరారు