
గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
ఏ ఐ ఎఫ్ డి ఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్
నల్లబెల్లి నేటి ధాత్రి: ప్రైవేటు పాఠశాలలో ఫీజు నియంత్రణ చేయాలని అలాగే గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐడీఎస్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్, మార్త నాగరాజు మాట్లాడుతూ ఫీజులు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని గుర్తింపులేని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్ యూనిఫామ్స్ , పుస్తకాలు పాఠశాలలో అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలని , అధికారులు దీనిపై నిఘా పెట్టాలన్నారు . ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు నెలకొల్పాలన్నారు . సామాన్యుడికి విద్య అందని ద్రాక్షలా మారిందని , ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు నెలకొల్పినప్పుడే అందరికి విద్య అందుతుందన్నారు . ప్రైవేటు స్కూలు బస్సులపై నిఘు ఉంచాలని పర్మిట్ లేని కాలం చెల్లిన వాహనాలను సీజ్ చేయాలని ప్రభుత్వ పాఠశాలలో సిబ్బంది కాక విద్యార్థులచే పలు పనులు చేయిస్తూ సేద తీరుతున్నారు ఇదేమిటని ప్రశ్నించిన తల్లిదండ్రులపై అమానుషంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు మండలానికి విద్యాధికారి లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు గతంలో మండల గురుకుల పాఠశాల నుండి విద్యార్థినిలు తప్పిపై శవమై తేలిన గాని జిల్లా విద్య అధికారులకు పట్టించకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు విద్యార్థి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు ఇప్పటికైనా అధికారులు మండల విద్యా వ్యవస్థ పై శ్రద్ధ చూపి అలాగే బోధన చేసే టీచర్లపై నిగా పెట్టి ఎప్పటికప్పుడు మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల అభ్యున్నతికై సహకరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు పై సమస్యలపై ప్రభుత్వం సహకరించకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని వారన్నారు కార్యక్రమంలో డివిజన్ నాయకులు అన్జిత్ వంశీ , రాకేష్ తదితరులు పాల్గొన్నారు.