
విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో సీసీపీఎల్ క్రికెట్ టోర్నీ నిర్వహణ అభినందనీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* అన్నారు. చిట్యాల మండలంలో చిట్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్ జిఎస్ఆర్ – సీసీపీఎల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. సిసిపిఎల్ టోర్నీ అధ్యక్షుడు చింతల మహేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో గెలుపొందిన ఇరు జట్లకు ప్రధమ బహుమతి కింగ్స్ – 11 టీమ్ కు ట్రోఫీతో పాటు రూ.70 వేల నగదును ఎమ్మెల్యే అందజేశారు. రెండో బహుమతిగా డ్రీమ్స్ – 11 టీమ్ కు రూ.30 వేల నగదును అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… క్రీడా పోటీలతో యువతకు శారీక దృడత్వంతో పాటు స్నేహభావం పెరుగుతాయని అన్నారు. ఆటలలో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. గత రెండు నెలలుగా నూతన ఆక్షన్ పద్ధతిలో సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఇంత పెద్ద మెగా క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించిన క్రీడా కమిటీని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, కార్యదర్శి గడ్డం కొమరయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ముకిరాల మధు వంశీ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్ టేకుమట్ల జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, మండల కాంగ్రెస్ జిల్లా నాయకులు జిల్లాస్థాయి క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు