కూకట్పల్లి జూలై 10 నేటి ధాత్రి ఇన్చార్జి
నిన్న మోడీ 3వ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి సంబరాలు చేసుకోవడం కాదు ముందు మే 5వ తారీఖున జరిగిన నీట్ పరీక్ష ఫలితాలు మొదట మే 14న ప్రకటిస్తాం అని తెలిపి చడీచప్పుడూ కాకుండా సరిగ్గా ఎన్నికల ఫలితాలు వెల్లడించే తేది నాడే నీట్ ఫలితాలు ప్రకటించడం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
(ఎన్ టీ ఏ) అక్రమాలకు పాల్పడిందని అనుమానించారు.అంతే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల వారికి గ్రేస్ మార్కులు ప్రకటించి తెలంగాణ విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపక పోవడం విద్యార్థుల
ను మోసం చేయడం సిగ్గుచేటు.నీట్ ప
రీక్ష పత్రం లీక్ అయింద ని చెప్పినా అధి కారులు నిమ్మకు నీరెత్తి నట్లు కూర్చోవడం సమంజసంకాదు.ఇప్పటికైనా ఆడంబ రాలు సంబరాలు చేసుకోవడం పక్కన పెట్టి 23 లక్షల విద్యార్థుల ఆవేదనను పట్టించుకుని తక్షణమే సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించా లి.నీట్ పరీక్షను రద్దు చేయడమే కాకుండా ఎన్ టీ ఏ సంస్థని కూడా
రద్దు చేసి నీట్ పరీక్షను మరల నిర్వ హించాలి.ఒకవేళ విద్యా ర్థులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకో బోమని మరో ఉద్యమానికి సిద్ధం అని నవ తెలంగాణ విద్యార్థి శక్తి ( ఎన్ టి వి ఎస్) రాష్ట్ర అధ్యక్షులు ఈ.పవన్ కుమార్ డిమాండ్ చేసి హెచ్చరించారు.