జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో శనివారం రోజున జైపూర్ ఎంపీపీ గోదారి రమాదేవి లక్ష్మణ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళ్తే
ముదిగుంట ఎల్లమ్మ గుడి దగ్గర మండలపరిషత్ 5,00000 లక్షల నిధుల ద్వారా కాలువపై కల్వర్ట్ నిర్మించుటకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.అలాగే ముదిగుంట గ్రామంలో జడ్పీ రోడ్డు నుండి హనుమాన్ ఆలయం వరకు 4,00000 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు మరియు గ్రామంలోని బోడ గూడెం ప్రైమరీ స్కూల్ నుండి అన్నవేన మల్లేష్ ఇంటి వరకు 3,00000 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు అలాగే బోడగూడెంలో సల్లూరి రాజేష్ ఇంటి నుండి గోగు తిరుపతి ఇంటి వరకు 3,00000 లక్షల వ్యయంతో సైడ్ డ్రైనేజీలు, మిట్టపల్లి గ్రామంలో దుర్గం రవి ఇంటినుండి దుర్గం రాజబాబు ఇంటి వరకు 2,00000 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మించుటకు ఈ రోజు భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.