ఎంపీపీ ఎస్ ప్రధానోపాధ్యాయులు ఆకినపల్లి సుధాకర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం బస్వారాజుపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలనుసారం గురువారం రోజున బస్వరాజుపల్లి ఎంపీపీ ఎస్ ప్రధానోపాధ్యాయులు ఆకినపల్లి సుధాకర్ మన ఊరు మనబడి బడిబాట కార్యక్రమంలో సుధాకర్ మాట్లాడుతూ ఇంటింటి కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులతో విద్య గురించి చెబుతూ విద్యార్థులకు కలిగే సదుపాయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరి స్తూ ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్నటువంటి సదుపాయాలు ఉచిత విద్య బోధన యూనిఫారంలు మధ్యాహ్నం భోజనము స్కాలర్ స్లిప్పులు నైపుణ్యంతో కలిగి ఉన్న ఉపాధ్యాయులతో విద్యను బోధిస్తూ ఆటపాటలతో స్వేచ్ఛగా చదివిస్తున్నామంటూన్నారు అదే ప్రైవేటు పాఠశాలల కంటే 100% విద్యను బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రాగాల అనిత అంగన్వాడీ టీచర్లు అన్నపూర్ణ తిరుపతమ్మ రాణి దేవమ్మ కట్ల లక్ష్మి ఎంపీటీసీ భవిత సుధాకర్ వార్డ్ మెంబర్ గట్టు రమేష్ సైన్ల తిరుపతి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు